కరోనా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో వినియోగదారులకు నిత్యావసరాలు, ఆహార పదార్థాలను వారి ఇంటికే తీసుకెళ్లేందుకు టాటా కన్జ్యూమర్ గూడ్స్‌తో ఈ-కామర్స్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ జతకలిసింది. వినియోగదారులు తమకు అవసరమైన నిత్యావసరాలను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటికే బెంగళూరులో అందుబాటులో ఉన్నదని, వచ్చే వారం ముంబై, ఢిల్లీలకు విస్తరిస్తామని, క్రమంగా ద్వితీయశ్రేణి నగరాలపై దృష్టిసారిస్తామని చెప్పారు.