సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ముగిసింది. కరోనా నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కరోనా వైరస్ విషయంలో నిన్న కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో చర్చించాం. ఎలా ముందుకు పోవాలో అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఇప్పటి వరకు తెలంగాణలో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు మాత్రమే విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగారు. మిగిలిన వారు ఇతర ఎయిర్‌పోర్టుల్లో దిగి బస్సులు, రైళ్లలో రాష్ర్టాలకు వచ్చారు. వేరే ఎయిర్‌పోర్టుల్లో దిగి రాష్ర్టానికి వచ్చిన వారిని గుర్తించడం కష్టం. ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కూడా రోడ్డు, మార్గాల ద్వారా వచ్చిన వారే. వియత్నాం చైనా పక్కనే ఉంటుంది. అయినా ఆదేశానికి ఇబ్బంది లేదు. ఏ దేశంలో చర్యలు తీసుకోలేదో అక్కడ ఇబ్బంది ఉంది.