టోక్యోలో మన షూటర్లు సత్తాచాటుతారు

ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ స్వర్ణ పతకాలు సాధించే సత్తా భారత షూటర్లకు ఉందని షూటింగ్‌ చాంపియన్‌ అభినవ్‌ బింద్రా అన్నాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పసిడి దక్కించుకున్న బింద్రా... విశ్వక్రీడల వ్యక్తిగత విభాగంలో ఆ ఘనత సాధించిన ఏకైక భారతీయుడిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ‘ఒలింపిక్‌ గేమ్స్‌లో ఒకటి కంటే ఎక్కువ స్వర్ణ పతకాలు సాధించే సత్తా మనకు ఉంది. నేను అదే ఆశిస్తున్నా’ అని బింద్రా అన్నాడు.